Neha Shetty : గ్లామర్ కి కొత్త డెఫినేషన్ చెప్పిన నేహా శెట్టి.

టాలీవుడ్ లో గ్లామర్ లుక్ తో ఆకట్టుకునే నటి నేహా శెట్టి. 'డీజే టిల్లు'లో రాధిక పాత్రతో కుర్రకారు మనసులు దోచేసింది ఈ బ్యూటీ. ఆ తర్వాత ఆమె 'బెదుర్లంక 2012', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, డీజే టిల్లు స్క్వేర్' వంటి చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నేహా.. సోషల్ మీడియాలో కూడా తన ఫ్యాషన్ సెన్స్ తో ఫాలోవరస్ ను సంపాదిస్తోంది. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటో షూట్ తో మరోసారి యువతను కట్టేపడేసింది. ఎర్ర చీరలో రిచ్ లుక్ తో అద్భుతంగా మెరిసిపోతూ, తన సొగసైన ఫోజులతో ప్రత్యేకంగా ఆకర్షించింది. జస్ట్మి, ఏ లిటిల్ అండ్ లాట్ యాటిట్యూడ్ అంటూ అంటూ తన గ్లామర్ కి కొత్త డెఫినేషన్ ఇచ్చింది. 'ఎర్ర చీరలో చాలా బావుంది', 'ఇంకెప్పుడు ఇలాంటి గ్లామర్
రోల్ చూడాలి' అంటూ ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com