Netflix Fixes : నెట్ ఫ్లిక్స్.. 2025లో సినిమాలు ఫిక్స్

ప్రముఖ ఓటీటీ సంస్థ 2025లో కీలక సినిమాలను స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అయ్యింది. ఒకప్పుడు ప్రాంతీయ చిత్రాలకు దూరంగా ఉన్న ఈ ఓటీటీ దిగ్గజం.. ఇప్పుడు వాటిపైనే దృష్టి సారించింది. అనేక దిగ్గజ సినిమాల స్ట్రీమింగ్ రైట్స్ ను విడుదలకు ముందే దక్కించుకున్నట్టు ప్రకటించింది. పవన్ కల్యాణ నటిస్తున్న ఓజీ, నాగచైతన్య, సాయిపల్లవి నటిస్తున్న తండేల్ సినిమాల రైట్స్ ను సొంతం చేసుకుంది ఈ సంస్థ. వీటితోపాటు మాస్ మహరాజా రవితేజ నటించిన మాస్ జాతర, నాని హీరోగా వస్తున్న హిట్-3, విజయ్ దేవరకొండ హీరోగా తెరెక్కుతున్న వీడీ 12, నార్నే నితిన్ మ్యాడ్ స్వేర్, సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న జాక్ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు ప్రకటించింది. ప్రియదర్శి నటిస్తున్న కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ, నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న అనగనగా ఒక రాజు సినిమాలకు సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులను తామే సొంతం చేసుకున్నట్టు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. తేదీలను తర్వాత ఖరారు చేసే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com