డిసెంబర్ 5-6 తేదీలలో 'స్ట్రీమ్‌ఫెస్ట్'.. ఉచితంగా నెట్‌ఫ్లిక్స్

డిసెంబర్ 5-6 తేదీలలో స్ట్రీమ్‌ఫెస్ట్.. ఉచితంగా నెట్‌ఫ్లిక్స్

డిసెంబర్ 5-6 తేదీలలో భారతదేశంలో 'స్ట్రీమ్‌ఫెస్ట్' హోస్ట్ చేయనున్నట్లు అమెరికాకు చెందిన కంటెంట్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ 'నెట్‌ఫ్లిక్స్' శుక్రవారం తెలిపింది. ఈ సందర్బంగా చందాదారులు కానివారికి ఈ రెండు (డిసెంబర్ 5 12.01am-డిసెంబర్ 6 11.59pm) రోజులు ఉచితంగా సినిమాలు, వెబ్ సిరీస్ లను వీక్షించే అవకాశం ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్నీ నెట్‌ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (కంటెంట్) మోనికా షెర్గిల్ ఒక బ్లాగ్‌పోస్ట్‌లో చెప్పారు.

భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న OTT మార్కెట్లో అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్స్టార్ , జీ5 వంటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ లతో పోటీపడేలా కొత్త వినియోగదారులను ఆకర్షించడం కోసం నెట్‌ఫ్లిక్స్ ఈ ఫెస్ట్ ను నిర్వహిస్తోంది.ఈ ఫెస్ట్ లో పాల్గొనాలంటే ఇప్పటివరకూ నెట్‌ఫ్లిక్స్ చందాదారులు కానివారు.. వారి పేరు, ఇమెయిల్ లేదా ఫోన్ నంబర్ , పాస్‌వర్డ్‌తో సైన్ అప్ చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story