దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు...గత 24 గంటల్లో

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు...గత 24 గంటల్లో
Covid cases in India: దేశంలో క‌రోనా ఉధృతి మళ్లీ క్రమంగా పెరుగుతోంది.

Covid cases in India: దేశంలో క‌రోనా ఉధృతి మళ్లీ క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 44 వేల 643 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రక‌టించింది. గడిచిన 24 గంట‌ల్లో కోవిడ్‌ నుంచి 41 వేల 096 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3 కోట్ల 18 లక్షల 56 వేల 757కు చేరింది.

ఇక మరణాల విషయానికొస్తే... నిన్న ఒక్క రోజే 464 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4లక్షల 26 వేల 754కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3 కోట్ల 10లక్షల 15 వేల 844 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 4లక్షల 14 వేల 159 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివ‌ర‌కు మొత్తం 49 కోట్ల 53 లక్షల 27 వేల 595 మందికి వ్యాక్సిన్ డోసులు వేశారు.

Tags

Read MoreRead Less
Next Story