Prabhas-Raghavapudi : కొత్త హీరోయిన్ ... ప్రభాస్-హను మూవీ స్టార్ట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కించనున్న కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభాస్ కొత్త లుక్ ఆకట్టుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు ఉంటుందని మేకర్స్ ప్రకటన చేశారు. అయితే ఈ సినిమా ఓ ఎపిక్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రానికి 'ఫౌజీ' అనే టైటిల్ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాట టాక్. ఇక విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, సుదీప్ ఛటర్జీ కెమరా బాధ్యతలు చేపట్టనున్నారు.
తాజాగా జరిగిన పూజా కార్యక్రమంలో ఓ అమ్మాయి తెగ సందడి చేసింది. మూవీ టీమ్లో భాగంగా ఫొటోలు కూడా దిగింది. చూడటానికి ఆమె కొత్తగా కనిపించటంతో ఈమె ఎవరా అంటూ నెటిజన్లు తన గురించి సోషల్ మీడియాలో తెగ వెతికేశారు. అయితే ఆమె పేరు ఇమాన్ ఇస్మాయిల్. ప్రొఫషన్ డ్యాన్సర్, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఈమె నెట్టింట పోస్ట్ చేసే పలు రీల్స్ చాలా ట్రెండ్ అయ్యాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com