Ram Pothineni : న్యూ ఇయర్ గిఫ్ట్ .. రామ్ కొత్త మూవీ పోస్టర్ రిలీజ్

రామ్ పోతినేని ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గుడ్ అండ్ క్రేజీ ఎంటర్ టైనర్ మూవీ చేస్తున్నాడు. ఆర్ఎపీవో 22 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీని రూపొందించిన స్టార్ డైరెక్టర్ మహేశ్ బాబు. పి ఈ మూవీని చిత్రీకరిస్తున్నాడు. రామ్ కు జంటగా మిస్టర్ బచ్చన్ భామ, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సె నటిస్తోంది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచలి నిర్మిస్తున్నారు. అయితే తాజా అప్డేట్స్ ప్రకారం న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఈ మూవీ నుంచి గా పోస్టర్ రిలీజ్ కానుంది. రేపు ఉదయం 10.35 గంటలకు హీరో, హీరోయిన్ రామ్, భాగ్యశ్రీల స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. కాగా వచ్చే సమ్మర్ లో ఈ మూవీ రిలీజ్ అవనుంది. వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న రామ్ పోతినేని ఈ సినిమాతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తాడని ఇండస్ట్రీ ఇన్ సైడ్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా కోసం తొలిసారిగా తమిళ మ్యూజిక్ ద్వయం వివేక్ శివ, మెర్విన్ టాలీవుడ్ లో అడుగుపెట్టనున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com