Nidhhi Agerwal : నేను గ్యాప్ ఇవ్వలేదు. గ్యాప్ వచ్చింది : నిధి అగర్వాల్

మున్నా మైఖేల్ సినిమాతో తెరంగేట్రం చేసిన భామ నిధి అగర్వాల్. ఆ తర్వాత సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందీ భామ. మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ సినిమాల్లోనూ నటించింది. 2021 తర్వాత టాలీవుడ్ కు దూరమైంది. మధ్యలో రెండు తమిళ సినిమాల్లో కనిపించిందీ భామ. ఇవి కాకుండా నిధి మరే ఇతర ప్రాజెక్ట్స్ కు సైన్ చేసినట్లు లేదు. కెరీర్ లో ఇంత గ్యాప్ రావడంపై అమ్మడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. "నేను గ్యాప్ ఇవ్వలేదు. గ్యాప్ వచ్చింది. ఫస్ట్ లాక్ డౌన్ కు ముందే 'హరిహర వీరమల్లు' సినిమాకు సైన్ చేశాను. ఆ టైమ్ కి గ్యాప్ లేదు. కానీ ఈ సినిమా ప్రాసెస్ జరగడానికి ఆల్మోస్ట్ మూడున్నర నుంచి నాలుగేళ్లు పట్టింది. ఈ సినిమా కంప్లీట్ వరకు వేరే ప్రాజెక్ట్ ఒప్పుకోకూడదని నేను కాంట్రాక్ట్ మీద సైన్ చేశాను. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన షూటింగ్ కి డేట్స్ ఇచ్చినప్పుడు నేను కూడా అందుబాటులో ఉండాలని ప్రొడక్షన్ టీమ్ కోరింది. అందుకే ఆఫర్స్ వచ్చినా నేను వేరే సినిమా ఏదీ చేయలేదు. షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మరో లాక్ డౌన్ వచ్చింది. చాలా టైమ్ పట్టింది. ఇక్కడ ఎవరి తప్పూ లేదు" అని తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com