Nidhi Agarwal : ఫుల్ బిజీగా నిధి.. ఒకేరోజు రెండు సినిమాలు

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కెరీర్ లో ఎప్పుడు లేనంత బిజీగా ఉంది. అంతేకాదు. కెరీర్ స్టార్ట్ చేసిన చాలా కాలానికి స్టార్ హీరోల సినిమాలు చేస్తోంది ఈ బ్యూటీ. అందులో ఒకటి పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న హరి హర వీరమల్లు కాగా, రెండవది ప్రభాస్ తో చేస్తున్న రాజాసాబ్. జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్న హరి హర వీరమల్లు చిత్రీకరణ విజయవాడలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు రాజాసాబ్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటూ బిజీగా ఉంది నిధి అగర్వాల్. ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా షేర్ చేసుకుంది. "కళాకారుల జీవితం సర్‌ప్రైజ్‌లతో నిండి ఉంటుంది. ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు పాన్ ఇండియా సినిమాలను ఒకే రోజున షూట్ చేసినందుకు సంతోషిస్తున్నా. అది కూడా ఒకటి ఆంధ్రాలో మరొకటి తెలంగాణలో. ఖచ్చితంగా ఈ రెండు సినిమాలు వేడుకగా జరుపుకునేలా ఉండబోతుతున్నాయని" ట్వీట్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com