Rajasaab : రాజాసాబ్ షూట్లో నిధిఅగర్వాల్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతీ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ రాజాసాబ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిధి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హారర్ అండ్ కామెడీ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా నుండి వర్కింగ్ స్టైల్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది నిధి. చాలా గ్యాప్ తరువాత రాజాసాబ్ షూట్ లో అడుగుపెట్టింది నిధి. దాంతో ఆమె షేర్ చేసిన ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక రాజాసాబ్ నుండి ఇటీవల విడుదలైన టీజర్ కి ఆడియన్స్ నుండి మరీ ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com