Niharika : నిహారిక విరాళం.. సోషల్ మీడియాలో వివాదం

Niharika : నిహారిక విరాళం.. సోషల్ మీడియాలో వివాదం
X

నిహారిక కొణిదెల తాజాగా ఏపీ వచ్చిన వరదబాధితులకు తనవంతు సహాయంగా కొంతమొత్తాన్ని విరాళంగా ప్రకటించారు. అయితే.. ఆమె అందించిన ఈ విరాళంపై విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. తెలంగాణ, ఏపీలో ఇటీవల వచ్చిన వరదలు బీభత్సం సృష్టించాయి.వరదబాధితులకు సహాయం అందించేందుకు టాలీవుడ్ సెలెబ్రిటీలంతా ముందుకు వచ్చారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఆర్థిక సహాయాన్ని అందించారు.

అదే విదంగా ఇప్పుడు మెగా డాటర్ నిహారిక కూడా ఏపీ సీఎం సహాయనిధికి రూ.5 లక్షలు విరాళం ప్రకటించారు. ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో తెలిపారు. బుడమేరు వాగు ముంపుతో అనేక గ్రామాలు నీట మునగడం, ప్రజలు ఇబ్బందులు పడుతుండడం నాకు చాలా బాధ కలిగించింది. ఇలాంటి ప్రకృతి విపత్తులో ఎక్కువగా ఇబ్బందులు పడేది గ్రామీణ ప్రజలే. నేను పుట్టి పెరిగింది నగరంలోనే అయినా.. మా పెద్దలు గ్రామీణ ప్రాంతం నుండి వచ్చినవారే. కాబట్టి.. వారు చెప్పే అనుభవాల దృష్ట్యా నాకు గ్రామీణ వాతావరణంపై అభిమానం ఉంది. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మా బాబాయ్ పవన్ కళ్యాణ్ గారితో పాటు.. మా ఫ్యామిలీలో అందరూ వరద బాధితులకు అండగా నిలబడడం నాకు సంతోషాన్ని కలిగించింది. ఈ మంచి కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకోవాలనే ఉద్దేశ్యంతో.. ముంపుకు గురైన పది గ్రామాలకు ఒక్కో గ్రామానికి ఏభై వేలు చొప్పున ఐదు లక్షలు రూపాయలు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ విపత్కర పరిస్థితుల నుండి ప్రజలంతా సురక్షితంగా బయటపడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.. అంటూ రాసుకొచ్చారు నిహారిక.

అయితే.. నిహారిక కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే విరాళాన్ని ప్రకటించడంపై విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో కూడా వరదలు వచ్చాయి కదా.. వారు మీకు కనిపించలేదా. వాళ్ళు ఏం అన్యాయం చేశారు? అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో.. నిహారికకు కానీసం విరాళం ఇవ్వాలన్న ఆలోచన వచ్చింది. అసలేం ఇవ్వనివాళ్ళు చాలా మంది ఉన్నారు. వీలుంటే వారిపై కామెంట్స్ చేయండి అంటూ మెగా డాటర్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు.

Tags

Next Story