Nithiin Robinhood : నితిన్ రాబిన్‌హుడ్ రిలీజ్ వాయిదా

నితిన్, శ్రీలీల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘రాబిన్‌హుడ్’ మూవీ విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని పేర్కొంది. వాస్తవానికి ఈ నెల 25న రిలీజ్ కావాల్సి ఉంది. కాగా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. . అయితే సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మూడు పెద్ద సినిమాలే కావడంతో థియేటర్ల సమస్య నెలకొనే అవకాశం ఉండటంతో నితిన్ నిర్ణయాన్ని నిర్మాతలు వ్యతిరేకిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. జనవరి నెలాఖరున లేదా ఫిబ్రవరి ప్రథమార్థంలో రాబిన్‌హుడ్‌ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com