Nivetha : నివేద ఈజ్ బ్యాక్! న్యూలుక్ చూశారా

Nivetha : నివేద ఈజ్ బ్యాక్! న్యూలుక్ చూశారా
X

అందం, ప్రతిభతో, మంచి మాటతీరుతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లకోట్టిన మలయాళీ బ్యూటీ నివేదా థామస్. తెలుగులో అద్భుతంగా మాట్లాడి మనసుల్ని దోచేసింది. నివేద తిరిగి నిన్ను కోరి, బ్రోచేవారెవరురా లో కనిపించినట్టుగా హీరోయిన్ మెటీరియల్ లుక్తో కనిపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ నివేద మాత్రం దీని కోసం జిమ్ లో కసరత్తులు చేయకపోవడం, అదనంగా శ్రమించకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. అయితే నివేద ఉన్నట్టుండి ఇటీవల కొత్త ఫోటోషూట్ తో అభిమానుల ముందుకు వచ్చింది. ఈసారి కొంత బరువు తగ్గి అందంగా కనిపించింది. లేటెస్ట్ ఫోటోషూట్ చూడగానే అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. నివేద ఈజ్ బ్యాక్! అంటూ ఫ్యాన్స్ తమ ఫేవరెట్ నటికి వెల్ కం చెబుతున్నారు. 2025 గద్దర్ అవార్డుల్లో కనిపించిన రూపానికి ఇప్పటికి చాలా మెరుగ్గా కనిపిస్తోంది. ఇప్పుడు బరువు తగ్గింది. ఇంకా మునుముందు బరువు తగ్గేందుకు ఆస్కారం ఉందని ఫ్యాన్స్ నమ్ముతున్నా రు. నివేద ఇదే తీరుగా కసరత్తులతో మరింత స్లిమ్ గా మారాలని కోరుకుంటున్నారు.

Tags

Next Story