Niveda Pethuraj : నివేదా పేతురాజ్ క్యూట్ సెల్ఫీ.. ఫొటోలు వైరల్

Niveda Pethuraj : నివేదా పేతురాజ్ క్యూట్ సెల్ఫీ.. ఫొటోలు వైరల్
X

తమిళం, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందిన నటి నివేదా పేతురాజ్. తన నటన, అందం, స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుందీ అమ్మడు. అయితే కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు టచ్లోనే ఉంటుంది. తాజాగా ఇన్స్టాగ్రామ్లో కొత్త ఫొటోను షేర్ చేసింది. అంచు బ్లాక్ సారీ లో తళుక్కుమంది. అద్దం ముందు నిల్చుని సెల్ఫీ తీసుకుంటూ మురిసిపోతుంది. తన క్యూట్ స్మైల్తో విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలకు ‘హే సోనియా' అంటూ క్యా ప్షన్ఇచ్చింది. వీటికి రచ్చకన్ చిత్రంలోని సాంగ్ 'సోనియా సోనియా'ను కూడా జోడించింది. ఈప్రస్తుతం పిక్సెనెట్టింట తెగ వైరల్ అవుతున్నా యి. ఇక నివేదా త్వరలో 'పార్టీ'లో కనిపించనుం ది. ఈ సినిమా విడుదల కాని తమిళ భాషా హాస్య చిత్రం. వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ మూవీని టి. శివ నిర్మించాడు. ఇందులో జై, శివ, సత్య రాజ్, జయరామ్, శామ్, రమ్య కృష్ణన్, రెజీనా కాసాండ్రా, సంచిత శెట్టి, నంద దురైరాజ్, నాజర్, చంద్రన్ కీలక పాత్రల్లో నటించారు. అయితే షూటింగ్ ఇప్పటికే పూర్తయినప్పటికీ, ఆర్థిక సమస్యల కారణంగా ఈ చిత్రం విడుదల కాలేదు.

Tags

Next Story