Nivetha Thomas : పూర్తిగా మారిపోయిన నివేదా థామస్.. మళ్లీ లావు అయిందిగా!

నాని జెంటిల్మెన్ మూవీతో 2016లో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నివేదా థామస్ . అంతకు ముందు బాల నటిగా సినిమాలు చేసిన ఈ భామ.. జెంటిల్మెన్ తర్వాత నిన్ను కోరి, జై లవకుశ, 118, బ్రోచె వారెవరురా, వి, వకీల్సాబ్ తదితర చిత్రాల్లో నటించింది. చివరగా 35: ఇది చిన్న కథ కాదు మూవీలో ప్రధాన పాత్ర పోషించింది. నిజానికి ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోవాలంటే.. హీరోయిన్లు టాలెంట్ తో పాటు ఫిజిక్ కూడా మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. కానీ నివేదా మాత్రం అందుకు భిన్నంగా నటనకు స్కోప్ ఉన్న మూవీస్ మాత్రమే చేస్తోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ అవార్డుల్లో పాల్గొనేందుకు వచ్చింది. 35: ఇది చిన్న కథ కాదు మూవీలో తన పాత్రకు ఉత్తమ నటిగా గద్దర్ అవార్డ్ కు ఆమె ఎంపికైంది. అవార్డు తీసుకునేందుకు వచ్చిన ఆమెను చూసిన వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఏంటీ నివేదా ఇలా మారిపోయింది? అని మాట్లడుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం షోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతానికి ఆమె చేతిలో కొత్త సినిమాలు లేవు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com