'నాకు ఎవరూ పని ఇవ్వడం లేదు'.. : ప్రముఖ నటి

నాకు ఎవరూ పని ఇవ్వడం లేదు.. : ప్రముఖ నటి
ప్రముఖ బాలీవుడ్ నటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని శాసిస్తూ తన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకున్న ఓ నటి ఇప్పుడు అజ్ఞాత జీవితం గడుపుతోంది.

ప్రముఖ బాలీవుడ్ నటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని శాసిస్తూ తన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకున్న ఓ నటి ఇప్పుడు అజ్ఞాత జీవితం గడుపుతోంది. ఈ నటి మరెవరో కాదు పూజా బాత్రా. బాలీవుడ్‌తో పాటు, పూజా తమిళం, తెలుగు, మలయాళం చిత్రాలలో కూడా కనిపించింది.

పూజా బాత్రా పంజాబీ పరిశ్రమలో కూడా పని చేసింది. ఇంగ్లీష్ సినిమాలు, టీవీ షోలలో కూడా కనిపించింది. పూజా బాత్రా గోవిందా, అనిల్ కపూర్, అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, సల్మాన్ ఖాన్ వంటి సూపర్ స్టార్స్ అందరితో పని చేసింది. 'నాయక్: ది రియల్ హీరో', 'కహిన్ ప్యార్ న హో జాయే' వంటి చిత్రాలలో పూజా బాత్రా నటనను ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. పూజా బాత్రా అందం, తెరపై ఆమె బబ్లీ స్వభావం ప్రేక్షకులకు చాలా నచ్చాయి. అయితే పెళ్లి తర్వాత పూజ ఇండస్ట్రీకి దూరమయ్యింది.

అయితే ఇప్పుడు పూజా ఇండియాకు తిరిగి వచ్చి మళ్లీ నటించాలనుకుంటున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. కానీ ఇప్పుడు ఆమెకు అవకాశాలు రావడం లేదు. నటిగా నటించడం కష్టమని, అయితే గ్యాప్ తీసుకున్న తరువాత తిరిగి మళ్లీ అవకాశాలు రావడం మరింత కష్టమని చెప్పింది. ఈ ఇంటర్వ్యూలో పూజా బాత్రా సినిమా నిర్మాతలందరికీ ఒక అభ్యర్థన కూడా చేసింది. 'తాను భారతదేశానికి తిరిగి వచ్చానని, మంచి ప్రాజెక్ట్‌లలో పని చేయాలనుకుంటున్నానని తనను చూస్తున్న ఫిల్మ్ మేకర్స్ అందరికీ చెప్పాలనుకుంటున్నాను' అని నటి చెప్పింది. మరి ఎవరైనా ఆమెకు అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.

పూజా బాత్రా వయసు 47 ఏళ్లు. అయినప్పటికీ, నటి ఇప్పటికీ చాలా హాట్‌గా కనిపిస్తుంది. ఆమె ఫిట్‌నెస్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. యంగ్ స్టర్స్ ఎంట్రీ ఇస్తున్న సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఆమెను వెతుక్కుంటూ వచ్చి సినిమా ఆఫర్ ఇచ్చే వాళ్లు ఉంటారా.

Tags

Read MoreRead Less
Next Story