Srinidhi Shetty : లైఫ్ లో ఏదీ పర్మినెంట్ కాదు : శ్రీనిధి శెట్టి

కేజీఎఫ్: ఛాప్టర్ 1లో రీనా దేశాయ్ పాత్రతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి. ఈ చిత్రం పాన్ఇండియా స్థాయిలో బ్లాక్బస్టర్ విజయం సాధించింది. కేజీఎఫ్: ఛాప్టర్ 2లోనూ ఈ బ్యూటీ నటనకు మంచి గుర్తింపు లభించింది. రీసెంట్ గా తెలుగులోకి అడు గుపెట్టిన ఈభామ. హిట్ 3లో నేచురల్ స్టార్ నానితో జంటగా నటించింది. ఈ సినిమా ఏకంగా రూ. 300కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో ఈ అమ్మడికి ఇప్పుడు తెలుగులో ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇప్పటికే నాలుగు సినిమాలు లైనప్ చేసిన ఈ భామ.. ప్రస్తుతం యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ సరసన 'తెలుసు కదా' మూవీలో నటిస్తోంది. అలాగే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ ఉంటూ ఫ్యాన్స్తో టచ్లోనే ఉంటుంది. ఇటీవల శ్రీనిధి సద్గురు ఈషా ఫౌండేషన్ని సందర్శించింది. అందులో లింగ భైరవి అమ్మవారిని దర్శించుకుంది. అక్కడ పూజలు చేస్తున్న ఫొటోలను ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది. దీనికి 'మనం అనుకున్నవన్నీ లైఫ్ లో జరగవు. అంతా మ్యాజిక్ లా ఉంటుంది. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. ఏదీ గ్యారెంటీ కాదు. కానీ నేను నీ సన్నిధిలో ఉన్నంత వరకు నేను అనుకున్నది సాధిస్తాను.. అదే నా నమ్మకం' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com