Vyuham Movie : వ్యూహం మూవీకి నోటీసులు

Vyuham Movie : వ్యూహం మూవీకి నోటీసులు
X

డైరెక్టర్ ఆర్జీవీ తెరకెక్కించిన ‘వ్యూహం’ మూవీకి ఏపీ ఫైబర్ గ్రిడ్ లీగల్ నోటీసులు పంపింది. ఫైబర్ నెట్‌లో వ్యూస్ లేకున్నా రూ.1.15 కోట్లు లబ్ధి పొందడంతో ఆర్జీవీ తోపాటు మరో ఐదుగురికి కూడా సమన్లు జారీ చేసింది. 15 రోజుల్లోగా వడ్డీతో సహా తీసుకున్న డబ్బును వెనక్కి కట్టాలని ఆదేశించింది. కాగా ఫైబర్ నెట్‌లో వ్యూహం సినిమాకు 1,816 వ్యూస్ రాగా అప్పటి ప్రభుత్వం రూ.1.15 కోట్లు చెల్లించిందని ఫైబర్ గ్రిడ్ ఆరోపించింది.

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సార్వత్రిక ఎన్నికలకు ముందు తీసిన ‘వ్యూహం’ సినిమాకు రూ.2.15 కోట్లకు ఫైబర్ నెట్ తో అగ్రిమెంట్ చేసుకుందని జీవీ రెడ్డి తెలిపారు. వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా జరిగిన ఈ ఒప్పందంలో కేవలం 1863 వ్యూస్ మాత్రమే వచ్చాయని తెలిపారు. ఈ లెక్కన ఒక్కో వ్యూస్‌కు రూ.11,000 చొప్పున చెల్లించారని వివరించారు. దీనిపై వివరణ కోరుతూ లీగల్ నోటీస్ ఇచ్చామని జీవీ రెడ్డి తెలిపారు.

Tags

Next Story