Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్యకు ఇప్పుడు గుడ్ టైం .. బేబీకి కోటి ?

Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్యకు ఇప్పుడు గుడ్ టైం .. బేబీకి కోటి ?
X

తెలుగమ్మాయి వైష్ణవి చైతన్యకు ఇప్పుడు గుడ్ టైం నడుస్తోంది. ప్రైవేట్ ఆల్బమ్స్ తో మొదలైన ఈ అమ్మడి కెరీర్ మొదలైంది. ఆ తర్వాత సినిమాల్లో చిన్న రోల్స్ చేసేదాకా వెళ్లింది. దాని తర్వాత బేబీ సినిమాతో ఒక్కసారిగా యూత్ కు క్రేజీ హీరోయిన్ గా మారింది. వైష్ణవి చైతన్య కంటే బేబీ అంటేనే గుర్తు పట్టేలా క్రేజ్ దక్కించుకుందీ బ్యూటీ. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వస్తున్న జాక్ సినిమాలో నటిస్తోంది. దీన్ని బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఆనంద్ దేవరకొండతో ఓ సినిమా చేయబోతోంది. దాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ మీద నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇలా పెద్ద బ్యానర్లలో ఆమెకు మంచి చాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ కు ప్రత్యేకించి హీరోయిన్లు ఎవరూ ఫామ్ లో లేరు. ఈ అమ్మడు ఒక్కో సినిమాకు కోటి రూపాయల దాకా తీసుకుంటోందని టాక్. ఆమె అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు కూడా ముందుకు వస్తున్నారట. మరో రెండు మూడు హిట్లు పడితే ఈ అమ్మడి రేంజ్ ఎక్కడికో వెళ్లిపో తుందంటున్నారు సినీ విశ్లేషకులు.

Tags

Next Story