NTR New Film : ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కొత్త సినిమాపై అప్ డేట్ ఇదిగో

NTR New Film : ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కొత్త సినిమాపై అప్ డేట్ ఇదిగో
X

‘దేవర' భారీ విజయం, బాలీవుడ్లో నటిస్తున్న 'వార్ 2' సినిమాల తర్వాత జూ.ఎన్టీఆర్ నటించే సినిమాలకు సంబంధించి తాజా సమాచారం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం లాంఛనంగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ (కేజీఎఫ్ ఫేమ్ ) సినిమా ప్రారంభమైంది. అయితే రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడనే దానిపై స్పష్టత కోసం అంతా చూస్తున్నారు. తాజాగా గురువారం రామోజీ ఫిల్మ్ సిటీలో వీరి సినిమా మొదలైంది. యాక్షన్ సన్నివేశాలతో, వందలాది జూ.ఆర్టిస్టులు పాల్గొంటుండగా షూటింగ్ చేస్తున్నారు. ఎన్టీఆర్కు ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పే పనిలేదు. ఇక ప్రశాంత్ నీల్ సైతం 'కేజీఎఫ్ ' సిరీస్, 'సలార్' సినిమాలతో మాస్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వీరి కలయిక సినిమా అంటే అంచనాలు భారీగానే ఉంటాయి. ప్రస్తుతానికి జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్న యాక్షన్ సీన్స్ తీస్తున్నారు. తదుపరి షెడ్యూల్ నుండి ఎన్టీఆర్ చిత్రీకరణలో పాల్గొంటారని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, కల్యాణ్ రామ్, హరికృష్ణ కొసరాజు నిర్మాతలు. భువన్ గౌడ ఛాయాగ్రహణం, రవి బష్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో నటించే ఇతర ఆర్టిస్టుల గురించి త్వరలో వెల్లడిస్తారు.

Tags

Next Story