NTR : హీరోగా ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన లైనప్ మామూలుగా లేదు. ప్రస్తుతం ఆయన ‘వార్ 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆయన గ్రేషేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆయాన్ ముఖర్జీ దర్శకుడు. యష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నది. ఈ సినిమా తర్వాత కూడా మరోసారి యష్‌రాజ్ ఫిల్మ్స్ తో సినిమా చేసేందుకు సిద్దమవుతున్నాడట ఎన్టీఆర్. ఇప్పటికే చర్చలు కూడా జరిగాయట. ఇక ఈ సినిమాకు ‘వార్ 2’ దర్శకుడు అయాన్ ముఖర్జీనే దర్శకుడిగా ఉంటారని సమాచారం. కథను కూడా సిద్ధం చేశారట అయాన్. పూర్తిస్థాయి బాలీవుడ్ చిత్రంగా రూపొందించి, పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com