Tollywood : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ .. పవర్ ఫుల్ టైటిల్

Tollywood : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ .. పవర్ ఫుల్ టైటిల్
X

ఎన్టీఆర్ హీరోగా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే లాంఛనంగా మొదలయ్యింది. కేజీఎఫ్, సలార్ భారీ బ్లాక్ బస్టర్స్ తరువాత ప్రశాంత్ నీల్, దేవర తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడుతున్నాయి. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేశారట మేకర్స్. పక్కా మాస్ అండ్ కమర్షియల్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాకు డ్రాగన్ అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేశారట. ప్రశాంత్ గత సినిమాల మాదిరి కాకుండా చాలా కొత్తగా ఉండబోతుందట ఈ సినిమా. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags

Next Story