NTR : స్టైలిష్ లుక్‌లో ఎన్టీఆర్ ... ఫోటోలు వైరల్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరికొత్త లుక్‌లో కనిపించారు. ఆయన లైట్ బియర్డ్, స్టైలిష్ హెయిర్ స్టైల్‌తో గాగుల్స్ పెట్టుకొని ఎయిర్‌పోర్టు దగ్గర కెమెరాకు చిక్కారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరలవుతున్నాయి. మొన్న తారక్ చేసిన ఓ యాడ్‌లో లుక్ అంతగా బాలేదని విమర్శలు రాగా.. ఈ లుక్ సరిపోతుందా? అంటూ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. NTR-NEEL మూవీ లుక్ ఇదేనా? అని పోస్టులు పెడుతున్నారు.
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘వార్-2’ సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశముంది. ఈ చిత్రంలో స్టార్ హీరోల మధ్య ఓ సాంగ్ ప్లాన్ చేయగా తాజాగా రిహార్సల్స్‌లో హృతిక్ గాయపడినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. మేలో ఈ పార్ట్ షూట్ చేస్తారని సమాచారం. దీంతో విడుదలపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దీనిపై మూవీ యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com