NTR War 2 : ఆగస్టు 25న ఎన్టీఆర్ వార్ 2 రిలీజ్

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న సినిమా 'వార్ 2'. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై నార్త్ తో పాటు సౌత్ లోనూ భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర గురించిన కథనాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇందులో ఎన్టీఆర్ 'వీరేంద్ర రఘునాథ్' అనేరా ఏజెంట్ పాత్రలో కని పించబోతున్నాడు. సౌత్ ఇండియాకు చెందిన వీరేంద్ర తన సహచరుల చేతిలో మోసపోయి తర్వాత నెగెటివ్ మైండ్ సెట్ తో ఉంటాడు. అలాంటి వ్యక్తితో ఇండియన్ రా ఏజెంట్ కబీర్ తలపడాల్సి ఉంటుందట. అంటే ఓ రకంగా ఇందులో ఎన్టీఆర్ చేస్తున్నది విలన్ పాత్రే అని ఫిక్స్ అయిపోవచ్చు. మరి చివర్లో ఏదైనా ట్విస్ట్ ఉండొచ్చనే టాక్ ఉంది. ఇక ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చేయాలని అప్పుడే ని ర్ణయించుకున్నారు. అయితే రీసెంట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ ను చిత్ర రచయిత అబ్బాస్ టైర్ వాలా రివీల్ చేశాడు. షూటింగ్ ఇంకా పెండింగ్ ఉందని.. అందుకే ఆగస్ట్ 15న రావడం సాధ్యం కాకపోవచ్చని, 25న రిలీజ్ అవుతుందంటూ క్లారిటీ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com