సినిమా

Radhe Shyam: 'రాధే శ్యామ్' నుండి స్యాడ్ సాంగ్.. అర్జిత్ సింగ్ వాయిస్‌లో 'సోచ్ లియా'..

Radhe Shyam: తాజాగా రాధే శ్యామ్ సినిమా నుండి మరో ప్రేమగీతం విడుదలయ్యింది.

Radhe Shyam (tv5news.in)
X

Radhe Shyam (tv5news.in)

Radhe Shyam: ప్రభాస్, పూజా హెగ్డే జంటగా ఇంతకు ముందు ప్రేక్షకులు ఎన్నడూ చూడని 'రాధే శ్యామ్' లాంటి ఓ పీరియాడిక్ ప్రేమకథను మనకు అందించడానికి వచ్చేస్తున్నాడు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. చాలాకాలం తర్వాత ప్రభాస్‌ను మళ్లీ లవర్ బాయ్‌లాగా ప్రేక్షకులకు చూపించనున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఓ ప్యూర్ లవ్ స్టోరీ అని ఇప్పటికే మూవీ టీమ్ తెలిపారు. తాజాగా ఈ సినిమా నుండి మరో ప్రేమగీతం విడుదలయ్యింది.

పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న 'రాధే శ్యామ్'కు ప్రతీ భాషలో హైప్ తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది మూవీ టీమ్. అందుకే ముందుగా పాటలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం సినిమాలోని పాటలను ముందుగా హిందీలో విడుదల చేయడం మొదలుపెట్టారు దర్శక నిర్మాతలు. అందుకే సాడ్ సాంగ్‌ను కూడా ముందుగా హిందీలోనే విడుదల చేశారు.

ఇంతకు ముందు రాధే శ్యామ్ నుండి ఆషిఖీ ఆగయి పాట కూడా ముందు హిందీలో విడుదల చేసిన తర్వాతే మిగతా భాషల్లో రిలీజ్ చేశారు. ఇప్పుడు కూడా 'సోచ్ లియా' అనే వీడియో సాంగ్‌ను ముందుగా హిందీలోనే విడుదల చేసింది మూవీ టీమ్. ఈ రెండు పాటలను బాలీవుడ్ టాప్ సింగర్ అర్జిత్ సింగ్ పాడడం విశేషం. విజువల్స్, అర్జిత్ సింగ్ వాయిస్, ప్రభాస్, పూజా హెగ్డే యాక్టింగ్.. ప్రేక్షకులను మళ్లీ మళ్లీ ఈ పాటను చూసేలా చేస్తున్నాయి.

Next Story

RELATED STORIES