Ananya Panday : అప్పుడే పెళ్లి పీటలు ఎక్కుతా: అనన్య పాండే

Ananya Panday : అప్పుడే పెళ్లి పీటలు ఎక్కుతా: అనన్య పాండే
X

ఐదేళ్ల తర్వాతే తాను పెళ్లి పీటలు ఎక్కుతానని హీరోయిన్ అనన్య పాండే స్పష్టం చేశారు. ఫోర్బ్స్ ఇండియా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ‘అందరిలాగే తప్పకుండా పెళ్లి చేసుకుంటా. కొత్త ఇల్లు నిర్మించుకోవాలి. ఇంటి నిండా కుక్కలను పెంచుకోవాలి. ఆ తర్వాత వివాహం చేసుకుంటా’ అని తెలిపారు. కాగా మాజీ మోడల్ వాకర్ బ్లాంకోతో అనన్య డేటింగ్ చేస్తున్నట్లు టాక్. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లికి వీరిద్దరూ కలిసే హాజరయ్యారు. దీంతో వీరిద్దరిపై అప్పుడే డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ఈ జంట పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్‌ పోస్టులు పెట్టారు. అయితే డేటింగ్‌పై అనన్య ఇప్పటివరకు స్పందించలేదు. ఈ పెళ్లిలో వాకర్‌ని తన భాగస్వామిగా పరిచయం చేసింది. ఈ వేడుకల్లో ఓ సాంగ్‌కు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేశారు. అంతకుముందు బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్‌తో డేటింగ్ చేసింది. ఈ ఏడాది మార్చిలో ఈ జంట ఇద్దరూ విడిపోయారు. అయితే తమ రిలేషన్ షిప్ గురించి ఎక్కడా కూడా స్పందించలేదు.

Tags

Next Story