Operation Sindoor Movie : ఆపరేషన్ సిందూర్ మూవీ ఫస్ట్ లుక్

Operation Sindoor Movie : ఆపరేషన్ సిందూర్ మూవీ ఫస్ట్ లుక్
X

పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకం గా ఇండియన్ఆర్మీ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' పేరుతో బాలీవుడ్ లో సినిమా రానుంది. ఉత్తమ్ నితిన్ దర్శకత్వంలో, నిక్కీ విక్కీ భగ్నానీ ఫిల్మ్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కనుంది. దీనిపై తాజాగా అధికారిక ప్రకటన చేసి ఓ పవర్ఫుల్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. మే 6 ,7 మధ్య రాత్రి భారత సాయుధ దళాలు నిజ జీవిత ఆపరేషన్ ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు.. ఈ పోస్ట ర్లో టైటిల్ పై 'భారత్ మాతా కీ జై' అని రాసి ఉంది. ఆర్మీ యూనిఫాం ధరించి.. రైఫిల్ పట్టుకొని నుదుటన సిందూరం పెట్టుకుంటోన్న మహిళ కనిపించింది. అలాగే బ్యాక్ గ్రౌండ్లో ట్యాంకులు, ముళ్ల కంచెలు, ఫైటర్ జెట్లను, మం డుతున్న యుద్ధ భూమిని చూపారు. ఇవి ధైర్యం, త్యాగం, జాతీయవాదం ఇతివృ త్రాలను బలోపేతం చేస్తాయంటున్నారు సినీ విశ్లేషకులు. త్వరలోనే నటీనటుల వి వరాలను వెల్లడించనున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా ఉగ్రవాద లోకానికి వణుకు పు ట్టించిన 'ఆపరేషన్ సిందూర్' పేరుతో సినిమా తీసేందుకు సినీ దర్శక నిర్మా తలు పోటీపడ్డారు. ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్లో జీ స్టూడియోస్, టీసిరీస్ లాంటి కొన్ని బాలీవుడ్ బడా నిర్మాణసంస్థలు కూడా ఈ పేరు కోసం పోటీపడుతూ రిజిస్టర్ చేసుకున్న విషయం తెలిసిందే.

Tags

Next Story