Oscars : ఏఐ చిత్రాలకూ ఆస్కార్

2026 అవార్డ్స్ వేడుకల డేట్ ఫిక్స్ టాకీస్: ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక వివరాలు తాజాగా అకాడమీ పేర్కొంది. లాస్ ఏంజె లెస్లోని డాల్బీ థియేటర్లో 98వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకలను 2026లో మార్చి 15న నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈపురస్కారాల కోసం పోటీ పడనున్న మూవీల లిస్టును 2026 జనవరి 22న ప్రకటించనున్నట్లు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వెల్లడించింది. ఈసారి కొన్ని కొత్త రూల్స్ ప్రవేశ పెట్టింది. ఎలిజిబిలిటీ గైడ్ లైన్స్, నామినేషన్స్, ఓటింగ్లో నిబంధనలు సవరించినట్లు పేర్కొంది. ఇక నుంచి ఓట్ వేయాలంటే నామినేట్ అయిన సినిమాను అకాడమీ సభ్యులు కచ్చితంగా వీక్షించాలని చెప్పింది. ఫైనల్ ఓటింగ్ ముందు కాస్టింగ్ డైరెక్టర్లకు కొన్ని రౌండ్ల టెస్టింగ్ ఉంటుందని వెల్లడించింది. చిత్ర పరిశ్రమలో పెరుగుతోన్న టెక్నాలజీని దృష్టిలోపెట్టుకున్న అకాడమీ.. ఈసారి ఏఐ వాడిన చిత్రాలను అనుమతిం చనున్నారు. ఇది ఇతర చిత్రాలపై ప్రభావం చూపదని పేర్కొంది. అయితే హ్యూమన్ క్రి యేటివిటీకే ప్రాధాన్య మిస్తామని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com