Paatal Lok Season 2 : పాతాళ్ లోక్ వెబ్ సిరీస్ .. స్టీమింగ్ కు రెడీ

దాదాపు ఐదేండ్ల క్రితం ఓటీటీలోకి వచ్చిన 'పాతాళ్ లోక్' వెబ్ సిరీస్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిన ఈ సిరీస్కి ఇన్నాళ్లకు రెండో సీజన్ తీసుకొస్తున్నారు. స్టార్ జోడీ కోహ్లి అనుష్క శర్మ ని ర్మించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ 'పాతాళ్ లోక్'. 2020లో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైన ఈ సిరీస్లో తొమ్మిది ఎపి సోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి 40 నిమిషాల వరకు ఉన్నప్పటికీ.. ప్రతి నిమిషం థ్రిల్లింగ్ ఉండటంతో ఈ సిరీస్ని ఎగబడి చూశారు. మర్డర్స్, ధనిక పేద మధ్య అంతరం లాంటి అంశాలను నిజ జీవితంలో ప్రతిబిం బించేలా చూపించడంపై ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 'పాతాళ్ లోక్' రెండో సీజన్.. జనవరి 17 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. పోస్టర్లో ప్రధాన పాత్రధారి జైదీప్ అహ్లావత్ ముఖం ఓవైపు నార్మల్ గా ఉండగా.. ఎద్దు పుర్రెతో కప్పినట్లు ఉంది. చూస్తుంటేనే రెండో సీజన్ కూడా రచ్చలేపడం ఖాయమనే టాక్ వస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com