Balakrishna : సరైన సమయంలోనే పద్మభూషణ్: బాలకృష్ణ

Balakrishna : సరైన సమయంలోనే పద్మభూషణ్: బాలకృష్ణ
X

సరైన సమయంలోనే పద్మభూషణ్: బాలకృష్ణసరైన సమయంలో కేంద్రం తనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిందని హీరో బాలకృష్ణ అన్నారు. ఆలస్యంగా పురస్కారం వచ్చిందనే విషయమై ఆయన స్పందించారు. ఆదిత్య 369 వంటి సినిమాలు ఏ జనరేషన్‌కైనా నచ్చుతాయని చెప్పారు. ఇలాంటి సినిమాలు చేయాలని చాలా మంది ప్రయత్నించినా ఈ స్థాయిలో సక్సెస్ అవ్వలేదన్నారు. ఏప్రిల్ 4న ఈ మూవీ రీ-రిలీజ్‌ కానున్న సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు. ఆదిత్య 369 లాంటి సినిమాను రూపొందించాలని చాలామంది ప్రయత్నించారని, కొన్ని ప్రారంభించకుండానే ఆగిపోయాయని తెలిపారు. మరికొన్ని ఈ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయని చెప్పారు. తెలుగు ప్రేక్షకులు ఎల్లప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారని, అందుకే ఆదిత్య 369 లాంటి చిత్రాన్ని అందించగలిగామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్, బాబూ మోహన్‌, దర్శకులు అనిల్‌ రావిపూడి, బాబీ తదితరులు పాల్గొన్నారు.

Tags

Next Story