PAK: పాక్ నటీనటులపై నిషేధం

పహల్గామ్లో లో ఉగ్రమూకలు సృష్టించిన నరమేధం నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట పాకిస్తాన్ కి చెందిన నటీనటులను భారతీయ చిత్రాల్లో నటించకుండా పూర్తి ఇషేధం విధించింది. అయితే ఈ నిషేధం ప్రస్తుతం రెండ్లు చిత్రాలపై పడనుంది ఒకటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చిత్రం ‘ఫౌజీ' ఒకటైతే రెండవది హిందీ లో తెరకెక్కుతున్న ‘అబిర్ గులాల్’. అందుకు కారణం ఫౌజీ లో నాయికా గా నటిస్తున్న ఇమాన్వీ, అబిర్ గులాల్ లో హీరోగా నటిస్తున్న ఫవాద్ ఖాన్ ఇద్దరూ కూడా పాకిస్తాన్ కి చెందిన వారు కావడమే. దీంతో వీరిద్దరినీ సినిమాల నుంచి తొలగించాలని డిమాండ్ వినిపిస్తోంది. పెహల్గామ్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటిస్తూనే, తన గురించి జరుగుతున్న ప్రచారం పట్ల వివరణ ఇచ్చింది. తన కుటుంబానికి గతంలో, వర్తమానంలో పాకిస్థాన్ మిలిటరీతో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవని, కేవలం ద్వేషంతో వీటిని ప్రచారం చేశారని పేర్కొంది. తాను ఇండో అమెరికన్ అని స్పష్టం చేసింది. తన పేరెంట్స్ ఏనాడో అమెరికా వెళ్లి స్థిరపడిపోయారని, తాను కూడా అక్కడే పుట్టానని వెల్లడించింది. వారికి అక్కడి పౌరసత్వం కూడా ఉందని చెప్పింది. అయితే ఇలాంటి ఉగ్రఘటనలు జరిగిన ప్రతిసారి పాక్ నటీనటులపై నిషేధం అనే మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఉరీ, పుల్వామా వంటి ఉగ్రవాద దాడుల తర్వాత ఈ డిమాండ్లు మరింతగా పెరిగాయి. 2016లో ఉరీ దాడి తర్వాత, ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ పాకిస్థానీ నటీనటులను నిషేధించాలని నిర్ణయించింది. 2019లో పుల్వామా ఘటన తరవాత, ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ కూడా ఇదే డెసిషన్ తీసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com