Prabhas : ప్రభాస్ సినిమాలో పాకిస్థాన్ నటి?

Prabhas : ప్రభాస్ సినిమాలో పాకిస్థాన్ నటి?
X

హను రాఘవపూడి-ప్రభాస్ కాంబోలో రానున్న మూవీలో పాకిస్థాన్ నటి సజల్ అలీ హీరోయిన్‌గా నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ కోసం ఆమెను సంప్రదించినట్లు సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. పాక్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో సజల్ ఒకరు. ఆమె 2017లో శ్రీదేవి ప్రధాన పాత్రలో వచ్చిన ‘మామ్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 'కల్కి' సీక్వెల్​తోపాటు 'సలార్- 2', 'రాజాసాబ్', 'స్పిరిట్' సినిమాలు ఉన్నాయి. ఇందులో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా హార్రర్ కామెడీ థ్రిల్లర్ జానర్​రో రూపొందనుంది. ఇందులో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసి 2025 సంక్రాంతికి సినిమా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.

Tags

Next Story