Mahesh Babu : పండుగాడి పాస్ పోర్ట్ తిరిగొచ్చింది

Mahesh Babu : పండుగాడి పాస్ పోర్ట్ తిరిగొచ్చింది
X

సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి కాంబోలో వస్తున్న పాస్ వరల్డ్ సినిమా 'ఎస్ఎస్ఎం బీ 29'. ఇప్పటికే ఒడిశా షెడ్యూల్ సక్సెస్ ఫుల్ గా ఫినిష్ కాగా.. హైదరాబాద్ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. అయితే ఓ వైపు మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంటే వారానికి ఓసారి ఫార్టిస్టూర్ కు వెళ్తున్న ప్రిన్స్ ను సింహాన్ని బోనులో బంధించిన ట్టు.. మహేశ్ పాస్ పోర్ట్ ను లాక్కున్నట్టు ఫొటోకు పోజ్ ఇచ్చారు. సింహాన్ని బోనులో లాక్ చేసినట్లు అర్థం వచ్చేలా వీడియో షేర్ చేశారు. అప్పట్లో ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ప్రస్తుతం షూట్ కు చిన్న బ్రేక్ ఇవ్వడంతో వెంటనే విదేశీయానాని కి పయనమయ్యాడు మహేశ్ బాబు. తాజాగా పాస్ పోర్టు తన చేతికి వచ్చిందని ఎయిర్పోర్టులో ఫొటో గ్రాఫర్లకు చూపించారు. ఈ క్రమంలో తన ముద్దుల తనయ సితారతో కలిసి వెకేషన్ ను వెళ్తున్న వీడియో వైరలవు తోంది. 'పండుగాడి పాస్ పోర్ట్ తిరిగొ చ్చింది. ఇక మనల్ని ఎవడు ఆపలేడు. నువ్వు పాస్ పోర్ట్ లాక్కుంటే భయపడానికి ఆయన స్టార్ కాదు సూపర్ స్టార్' అని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. డైరెక్టర్ ఎవరైనా మహేశ్ టూర్స్ వెళ్లడం సహజమని కామెంట్లు చేస్తున్నారు.

Tags

Next Story