Paruchuri Gopala Krishna : రాధేశ్యామ్‌కి అదే పెద్ద మైనస్ : పరుచూరి

Paruchuri Gopala Krishna : ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ చిత్రంపై టాలీవుడ్ సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాని ఓటీటీలో చూసిన ఆయన పరుచూరి పలుకులు విశ్లేషణలో భాగంగా మాట్లాడారు. కథాంశం అద్భుతంగా ఉన్నప్పటికీ, సినిమాని సరిగ్గా ఎగ్జిక్యూషన్ చేయడం వల్ల విఫలం అయిందని అన్నారు. సినిమాకి మరోప్రధాన లోపం సంగీతమని అన్నారు.
అద్భుతమైన లవ్ స్టోరీ అన్నప్పుడు ప్రేక్షకులు మంచి పాటలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తారని కానీ ఈ సినిమాలో శ్రావ్యమైన పాటలు లేవని అన్నారు. ఫైట్లు కూడా ఆకట్టుకునేలా లేవని అన్నారు. ప్రభాస్ గతంలో వర్షం, మిర్చి వంటి కొన్ని రొమాంటిక్ సినిమాలకు పనిచేశాడని, వీటిలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటుగా అందులో ప్రేమ కూడా ఉందని గుర్తుచేశారు పరుచూరి. ప్రభాస్ అభిమానులు ఆశించిన అంశాలు ఈ చిత్రంలో లేవని అన్నారు.
ఇక ఈ సినిమాకి టైటిల్ కూడా ఒక వంతు నెగిటివ్ అయిపోయిందని అన్నారు. కాగా కే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో ప్రభాస్ విక్రమాదిత్య అనే రోల్ లో కనిపించగా, ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com