Dil Raju : పవన్ ఎప్పుడంటే అప్పుడే గేమ్ చేంజర్ ఈవెంట్ : దిల్ రాజు

Dil Raju : పవన్ ఎప్పుడంటే అప్పుడే గేమ్ చేంజర్ ఈవెంట్ : దిల్ రాజు
X

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. గేమ్‌ చేంజర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కు హాజరుకానున్నారు. పవన్‌ కల్యాణ్‌ ఇచ్చే డేట్‌ను బట్టి ఈవెంట్ నిర్వహించనున్నారు. సినీ నిర్మాత దిల్‌ రాజు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తెలుగు సినిమా పుట్టినిల్లు విజయవాడ అన్న దిల్ రాజు విజయవాడలో జరిగిన రామ్ చరణ్ కటౌట్ లాంచింగ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో చేసుకుందామని అభిమానులను ఉత్సాహపరిచారు. పవన్ కళ్యాణ్ ఇచ్చే డేట్‌ను బట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ అనేది నిర్ణయిస్తామన్నారు దిల్ రాజు.

Tags

Next Story