Pawan Kalyan Son Akira : అభిమానులు ఫుల్ ఖుషీ .. ఓజీలో అకీరా

Pawan Kalyan Son Akira : అభిమానులు ఫుల్ ఖుషీ .. ఓజీలో అకీరా
X

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలైనా.. కొన్ని కారణాలతో కొంత వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం హీరో లేని సన్ని వేశాలను తెరకెక్కిస్తున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీని డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా ఓ అప్డేట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ నటిస్తు న్నాడు. రెండు రోజుల క్రితం అకీరాకు సంబంధిం చిన షూట్ కూడా ముగించారట. సినిమా చివరిలో వచ్చే కీలక ఘట్టాల్లో అకీరా కనిపించబోతున్నాడ ని టాక్. ఈ సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని మూవీ టీమ్ చెబుతోంది. తమ అభిమాన హీరో తనయుడు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్ట డంతో పవన్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Tags

Next Story