Nidhi Agarwal : పవన్ పాత్రలో లీనమై పోతారు : నిధి అగర్వాల్

పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా హరిహర వీరమల్లు. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఇది సిద్ధమవు తోంది. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపుదశకు చేరుకున్న విషయం తెలిసిందే. ఇందులో పవన్ సామ్రాజ్య వాదులకు వ్యతిరేకంగా.. స్వాతంత్య్రం కోసం ఓ యోధుడుగా కనిపించ నున్నారు. ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ నిధి అగర్వాల్. పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికరమైన విషయాలు ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 'సెట్స్ లో ఉన్నప్పుడు ఎంతో ఏకాగ్రతతో ఉంటారు. యాక్షన్ చెప్పగానే పూర్తిగా లీనమవుతారు. చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోరు. తన సన్నివేశంపై మాత్రమే దృష్టిపెడతారు. ఈ లక్షణాన్ని నేను కూడా అలవాటు చేసుకోవాలి.’ అని చెప్పారు. తన పాత్ర కోసం గుర్రపు స్వారీ, క్లాసికల్ డ్యాన్స్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నానని చెప్పారు. కథక్ కూడా నెర్చుకున్నానంటోంది నిధి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com