Pawan Kalyan : పుష్పపై పవన్ పరోక్ష విసుర్లు.. వీడియో వైరల్

ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "ఒకప్పుడు సినిమాలో హీరోలు అడవులను కాపాడేవారు. వాటిని స్మగ్లింగ్ నుండి రక్షించేవారు. ఈ రోజుల్లో స్మగ్లింగ్ చేయడం హీరోయిజం అయ్యింది" అని ఆయన అన్నారు.
40 ఏళ్ల క్రితం అడవులను కాపాడేవాడిని హీరోగా చూపించేవారనీ.. ఇప్పుడు అడవులు నరికి.. స్మగ్లింగ్ చేస్తే పాత్రలను హీరోలుగా చూపిస్తున్నారని చెప్పారు. మారిన ఈ కల్చర్ ఆందోళన కలిగిస్తోందనీ.. ఒకప్పుడు హీరో రాజ్ కుమార్ అడవులను కాపాడే హీరో పాత్ర వేశారనీ.. ఆయన నటించిన గంధ గుడి సినిమా అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు.
అడవిని రక్షించడమే గంధ గుడి సినిమా కాన్సెప్ట్ తనకు బాగా నచ్చిందని చెప్పారు పవన్. ఇప్పుడు స్మగ్లింగ్ చేసే పాత్రలు ఎక్కువగా కనిస్తున్నాయనీ.. ఒక సినిమా వ్యక్తిగా అలాంటి సినిమాలు చేయడం తనకు కష్టమన్నారు. అది బయటికి మంచి సందేశం ఇవ్వదని పవన్ చెప్పారు. బెంగళూరు పర్యటనలో ఉన్న పవన్ పుష్ప సినిమాను ఉద్దేశించే ఈ వ్యాఖ్యాలు చేశారన్న చర్చ నెట్టింట ప్రారంభమైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com