Payal Rajput : అలాంటోళ్లకే చాన్సులు.. టాలెంట్ ఉన్నా సరైన గుర్తింపు లేదు: పాయల్ రాజ్ పుత్

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వెంకీ మామ, తీన్ మార్ ఖాన్, జిన్నా, మాయాపేటిక, రక్షణ వంటి పలు చిత్రాల్లో నటించినా.. అవన్నీ కూడా ఆశించినంత సక్సెస్ ను ఇవ్వలేకపోయాయి. అజయ్ భూపతి దర్శకత్వంలోనే 2023లో వచ్చిన మంగళవారం మూవీ కొద్దిగా పర్వాలేదనిపించింది. అయితే రీసెంట్ గా పాయల్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ‘నటులుగా కెరీర్ ప్రారంభించడం చాలా కష్టం. బంధుప్రీతి, వివక్ష రాజ్యమేలుతున్న ఈ ప్రపంచంలో టాలెంట్ ఉన్నా నిరూ పించుకోవడం కష్టంగా మారుతోంది. ఇండస్ట్రీలో పేరున్న కుటుంబాల నుంచి వచ్చిన వారికే అవకాశాలు దక్కుతున్నాయి, టాలెంట్ ఉన్నా సరైన గుర్తింపు లభించడం లేదు. ఆధిప త్య ధోరణులు ఎక్కువగా ఉండే ఈ (సినీ) ప్రపంచంలో నా శ్రమ, అంకితభావం నిజంగా ఫలితాన్నిస్తాయా అని ప్రశ్నించుకున్నప్పుడు... ఏమో అనే సందేహం కలుగుతుంది. బాగా పేరు ప్రఖ్యాతులు కలిగిన ఇంటి పేర్లు కలిగిన వారికి, సమర్థులైన ఏజెంట్లు ఉన్నవారికి అవకాశాలు వెళ్లడాన్ని గమనించాను. నా ప్రతిభతో నేను ఇక్కడ నెగ్గుకు రాగలనా అని ఆలోచిస్తుం టాను. అందుకే నటులుగా ఉండడం కంటే కఠినమైన కెరీర్ మరొకటి ఉండదేమో! ప్రతి రోజూ అనిశ్చితే ఎందుకంటే ఇక్కడ టాలెంటు నెపోటిజం, ఫేష రెటిజం అనే అంశాలు ప్రతిభను తెరమరుగు చేస్తుంటాయి' అంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసింది. కాగా ప్రస్తుతం పాయల్ తెలుగులో 'వెంకటలచ్చిమి మూవీ చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com