టాలీవుడ్ హీరోయిన్ పై పోలీస్ కేసు.. ఎందుకంటే ..

Payal Rajput: RX100ఫేమ్ పాయల్ రాజ్‌పుత్‌పై పెద్దపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పెద్దపల్లిలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాయల్ పాల్గొన్నారు. అయితే కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి షాపింగ్ మాల్ ప్రారంభించారంటూ పెద్దపల్లి జూనియర్ సివిల్ కోర్టులో ఈ నెల 12న పిటిషన్ దాఖలైంది. ఆమెతోపాటు షాపింగ్ మాల్ యాజమాన్యం మాస్కులు ధరించలేదని, భౌతిక దూరాన్ని గాలికి వదిలేశారని పట్టణానికి చెందిన బొంకూరి సంతోష్ బాబ్జీ తరపున ఆయన న్యాయవాది డొంకెన రవి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
జూనియర్ సివిల్ ఇన్‌చార్జి జడ్జి పార్థసారథి సిఫార్సు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజేశ్ తెలిపారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 20 రోజుల క్రితమే వారిపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. అయితే, తాజాగా కోర్టు ఆదేశాలతో విషయం వెలుగులోకి వచ్చింది. నిబంధనలు ఉల్లంఘించిన షాపు యజమానితోపాటు పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. పాయల్ రాజ్‌పుత్ గత నెల 11న పెద్దపల్లిలో షాపింగ్ మాల్ ప్రారంభించారు.
పాయల్ రాజ్‌పుత్ RX100 సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా విజయం సాధించడంతో వరుస ఆఫర్లు వచ్చాయి. ఎన్టీఆర్ కథానాయకుడు, వెంకీమామ, డిస్కో రాజా వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం కిరాతక అనే తెలుగు సినిమ ాతోపాటు, పలు తమిళ సినిమాల్లో నటిస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com