Ram Gopal Varma : పోలీసుల గాలింపు.. భయం లేదంటూ వర్మ వీడియో

ఆంధ్రప్రదేశ్ పోలీసుల సెర్చింగ్ నేపథ్యంలో కాంట్రవర్సియల్ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్లో ఉన్నానని.. నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు రాలేకపోతున్నట్లు తెలిపారు. కేసులకు తానేమీ భయపడటం లేదని తెలిపారు. తాను పోస్టులు పెట్టినవారికి కాకుండా సంబంధం లేనివారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. జనరల్ ఎలక్షన్ కు ముందు 'వ్యూహం' సినిమా ప్రమోషన్ లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా సామాజిక మాధ్యమం వేదికగా రాంగోపాల్ వర్మ పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల తెదేపా ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకాకపోవడంతో అరెస్ట్ చేసేందుకు యత్నిస్తున్నారు. హైదరాబాద్ లోని ఆయన నివాసం వద్దకు ఇటీవల వెళ్లారు. దీంతో.. వీడియో విడుదల చేశారు ఆర్జీవీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com