Pooja Hedge: ముందుగానే రాసిపెట్టి ఉంటుంది.. అలానే జరుగుతుంది: పూజాహెగ్డే

Pooja Hedge: తీసిన సినిమాలన్నీ హిట్ అవ్వాలని ఏం లేదు.. అన్నీ ప్రేక్షకులకు నచ్చాలనీ లేదు.. ఒక్కోసారి దర్శకుడి అంచనాలు తారుమారు అవుతుంటాయి.. పెద్ద బడ్జెట్, పెద్ద పెద్ద స్టార్లు అయినా అనుకున్నంతగా ఆడని సినిమాలు ఎన్నో ఉంటాయి.
అభిమానుల అంచనాలను అందుకోలేకపోయిన రాధేశ్యామ్ గురించి ఆ చిత్రంలో నటించిన పూజాహెగ్డే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొన్ని సినిమాలు మనకు యావరేజ్ అనిపించినా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతాయి.
మరికొన్ని మనకు బాగా నచ్చినా రిజల్ట్ అనుకున్నట్లు ఉండకపోవచ్చు. ఏ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనేది ముందుగానే రాసి పెట్టి ఉంటుంది. అలానే జరుగుతుంది. రాధేశ్యామ్ విషయంలో కూడా అదే జరిగింది. బాక్సాఫీస్ వద్ద సినిమా తల రాత మారిపోతుంది అని బలంగా నమ్ముతాను అని చెప్పుకొచ్చింది.
ఈ చిత్రంలో ప్రభాస్, పూజా నటనకు మంచి మార్కులు పడ్డా ప్రేక్షకులకు కావలసిన యాక్షన్ ఎలిమెంట్స్ మిస్సయ్యాయని అదే సినిమాకు పెద్ద మైనస్ అయ్యిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com