Pooja Hegde : పూజాహెగ్దే చాలెంజింగ్ రోల్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న బుట్టబొమ్మ పూజాహెగ్దే. కెరీర్ స్టార్టింగ్ లో దాదాపు అగ్ర హీరోలందరితో ఆడిపాడి ఒక ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో చివరిసారిగా ఆమె ప్రభాస్ 'రా ధేశ్యామ్' లో కనిపించిన తర్వాత వెంకటేశ్, వరుణ్ తేజ్ ‘ఎఫ్ 3' మూవీలో ఒక స్పెషల్ సాంగ్ లో మెస్మరైజ్ చేసింది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ఈఅందాల భామ ప్రస్తుతం చాలా సెలెక్టి వ్ సినిమాలు చేస్తోంది. టాలీవుడ్ లో అడపదడపా చిత్రాలు చేస్తున్నా, తమిళ్ మాత్రం పలు క్రేజీ ప్రాజెక్టులను క్యూలో పెట్టింది. ఇప్పటికే స్టార్ హీరో సూర్య నటిస్తున్న 'రెట్రో' మూవీలో హీరోయిన్ గా చేస్తున్న పూజా, తమిళ స్టార్ హీరో విజయ్ 'జన నాయగన్' మూవీలోనూ నటిస్తోంది. ఈ రెండు చిత్రాలతో పాటు రాఘవ లారెన్స్ హార్రర్ సిరీస్ మూవీ 'కాంచన 4’లోనూ పూజా హెగ్దే నటిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమాలో పూజా పాత్రకు సంబంధించి ఓ ఇంట్రె స్టింగ్ వార్త కోలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఈముద్దుగుమ్మ ఓ మూగ, చెవిటి అమ్మాయి పాత్రలో కనిపిస్తుందట. ఈ మూవీలో ఆమె నటనకు ప్రేక్షకుల నుంచే కాకుండా, విమర్శకుల నుంచి కూడా ప్ర శంసలు పొందడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి చాలెంజింగ్ పాత్రలో పూజా నటిస్తుండటంతో అప్పుడే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మరి నిజంగానే పూజా ఈ సినిమాలో ఇలాంటి పాత్రలో నటిస్తుందా అనేది వేచి చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com