Pooja Hegde : బుట్టబొమ్మకు కోపమొచ్చింది

Pooja Hegde : బుట్టబొమ్మకు కోపమొచ్చింది
X

దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకున్న బుట్టబొమ్మ పూజా హెగ్దే. తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్ లో నటించిన 'దేవా' మూవీ. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అగ్ర హీరోల చిత్రాల్లో నటించడంపై ప్రశ్నలు ఎదురుకావడంతో పూజాహెగ్దేకి తీవ్ర కోపమొచ్చింది. ‘అన్ని సినిమాలకు నేను అర్హురాలినే. తమ చిత్రాల్లోకి నన్ను సెలక్ట్ చేసుకోవడంపై డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు కొన్ని కారణాలు ఉంటాయి. ఏదైనా చాన్స్ వచ్చినప్పుడు దానికి అనుగుణంగా ప్రిపేర్ అయ్యి పూర్తిస్థాయిలో ఆ పాత్రకు న్యాయం చేయాలి. అలా చేస్తే అదృష్టం వరించినట్లే అనుకుంట. నా లైఫ్ లో జరుగుతుంది అదే. ఒకవేళ మీరు అదృష్టం వల్లే నాకు ఈ అవకాశాలు వచ్చాయనుకుంటే.. నేను ఏమాత్రం బాధపడ. అలాగే అనుకోండి' అని అసహనం వ్యక్తం చేసింది. మరోవైపు ఇప్పటికే పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న పూజా హెగ్దే, విజయ్ 69లో కూడా మెయిన్ హీరోయిన్ గా కనిపించబోతోంది. అలాగే హిందీలో కూడా పలు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇక టాలీవుడ్ లో ఈ అమ్మడికి చాన్స్లు దక్కనప్పటికీ తన అందంతో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఉనికిని చాటుకుంటోంది.

Tags

Next Story