Pooja Hegde : హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒకేలా ఉంటా : పూజాహెగ్దే

దక్షిణాది ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో పూజాహెగ్దే ఒకరు. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను మెప్పించే ఈ భామ సందడి ప్రస్తుతం టాలీవుడ్లో తక్కువైనా.. తమిళంలో మాత్రం జోరు చూపిస్తోంది. అయితే ఆమె నటించిన సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కా జాన్, దేవా లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేక పోయాయి. దీంతో కొన్నేళ్లుగా ఆమె కెరీర్ లో విజయం అనే పదానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ విషయమై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పూజా.. తాను ఎన్నో సవాళ్లు, అనుభవాల తర్వాత ఇండస్ట్రీలో ఒక స్థాయిలో ఉన్నట్లు చెప్పింది. ఇంకా సాధించాల్సింది చాలా ఉందన్న ఈ భామ, పరాజయాల్ని అం గీకరించాల్సిందేనని చెప్పింది. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఒకేలా ఉంటానంది. అయితే కథలు, పాత్రలు ఎంచుకునే పద్ధతిని మార్చి ఇప్పుడు కొత్త ప్రయాణం మొదలు పెట్టాలను కుంటున్నట్లు వెల్లడించింది. త్వరలో విజయ్ కలిసి 'జన నాయగన్ ' మూవీతో ప్రేక్షకులను పలక రించడానికి సన్నద్ధమవుతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com