Pooja Hegde : తప్పులు జరిగాయని తెలుసు! : పూజ హెగ్డే

గత కొంతకాలంగా సినిమాలకుక్ దూరంగా ఉంటూ వస్తున్న పూజ హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోంది. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా వరుసగా క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెడుతోంది. ళపతి విజయ్ నటిస్తున్న 69వ చిత్రంలో నాయికగా ఆమె పేరే వినిపిస్తున్నది. సూర్య 44వ సినిమాలో కూడా పూజాహేగ్డే కథానాయికగా ఖరారైందని అంటున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో కూడా ఈ సొగసరి భారీ ఆఫర్‌ను సొంతం చేసుకుంది. వరుణ్‌ధావన్ సరసన ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నటించబోతున్నట్లు తెలిసింది. ‘హే జవానీ తో ఇష్క్ హోనా హై’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి డేవిడ్ ధావన్ దర్శకుడు. ఈ ఆఫర్ రావడం పట్ల పూజాహెగ్డే ఆనందం వ్యక్తం చేసింది. ‘సినిమాల ఎంపికలో నా మైండ్‌సెట్‌ను మార్చుకున్నా. కథల ఎంపికలో ఇకపై మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తా. నా గత చిత్రాలన్నింటిని విశ్లేషించి ఎక్కడ తప్పులు జరిగాయో తెలుసుకుంటా. వచ్చే ఏడాది నాకు మంచి విజయాల్ని అందిస్తుందనే నమ్మకంతో ఉన్నా’ అని పూజాహెగ్డే చెప్పింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com