Pooja Hegde : పూజా హెగ్దే మోనికా సాంగ్ ఆమెకూ చేరింది

స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే తాజాగా మోనికా సాంగ్ తో ఉర్రూతలూగించింది. సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ కూలీలో స్పెషల్ సాంగ్ అయిన మోనికాలో ఆమె స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. రిలీజ్ అయినప్పటి నుంచే ఈ పాట ఫుల్ ట్రెండింగ్ లో దూసుకెళ్తాంది. ఈ పాటను ఇటాలియన్ బ్యూటీ మోనికా బెలూచికి ట్రిబ్యూట్ గా రూపొందించాడు దర్శకుడు లోకేశ్ కనకరాజ్. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ కూడా ఆమెను అభిమానే. అందుకే వీళ్లు కూలీ మూవీ ప్రమోషన్స్ కోసం మోనికా పాటను పెట్టారు. తాజాగా ఈ పాట ఏకంగా ఇటాలి యన్ బ్యూటీ దాకా చేరిందట. పూజా హెగ్దేతో బాలీవుడ్ రిపోర్ట ర్ అనుపమ చోప్రా తాజాగా చేసిన ఇంటర్వ్యూలో ఈ వివరాలు వెల్లడించాడు. ఇది విన్న నటి ఎంతో ఎగ్జెట్ అయింది. మోనికా అంటే తనకు మాత్రమే కాదు.. తన టీమ్ అందరికీ ఇష్టమని, ఈ పాట చివరకు ఆమెను చేరడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. సోషల్ మీడియాలో హిట్ అయిన ఈ పాట మూవీలో ఉండదని. కేవలం బిజినెస్ పర్పస్ కోసమే చేశామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించా రు. రజినీకాంత్, నాగార్జున, ఆమిర్ ఖాన్, శ్రుతిహాస్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ నిన్న విడుదల అయి మంచి టాక్ సంపాదించుకుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com