Pooja Hegde : పాపం బుట్టబొమ్మ.. ధనుష్ సినిమా నుంచి అవుట్ !

Pooja Hegde : పాపం బుట్టబొమ్మ.. ధనుష్ సినిమా నుంచి అవుట్ !
X

బుట్టబొమ్మ పూజా హెగ్దే వరుస హిట్లతో దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్లో కూడా స్టార్ హీరోయిన్ గా సత్తా చాటింది. ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకొనే హీ రోయిన్లలో ఒకరిగా నిలిచింది. అందం, అభినయంతో ఆకట్టుకునే పాత్రలో నటి మెప్పించింది. అయితే స్టార్ గా టాప్ రేంజ్లోకి చేరుకొన్న ఆమె కెరీర్ ఒక్కసారిగా రివర్స్ అయింది. రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్, కిసి కా భాయ్, కిసి కీ జాన్, దేవా, రెట్రో సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆమె టైం బ్యాడ్ గా మారిపోయింది. ఆమె ఎన్నో ఆశలు పెట్టుకొని డీగ్లామరైజ్డ్ పాత్రలో నటించిన రెట్రో కూడా అభిమానులకు నిరాశను మిగిల్చిం ది. ఇలా వరుస ఫ్లాప్లతో ఆమె క్రేజ్ కొంత తగ్గింది. దీంతో తాజాగా ఆమెను తీసుకో బోయిన ధనుష్ కొత్త సినిమాలో దర్శకుడు విఘ్నేష్ రాజా ఆ ఆఫర్ ను రద్దు చేసి, ఆమె స్థానంలో తాజా క్రేజ్ కలిగిన మలయాళ బ్యూటీ మమితా బైజును ఎంపిక చేశారని సమాచారం. ఈ విషయం కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం మలయాళంలో మంచి ఫామ్‌లో ఉన్న మమితా బైజుకు 'ప్రేమలు' వంటి సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఆమెకు తెలుగు, తమిళ భాషల్లో కూడా మంచి క్రేజ్ లభిస్తోంది. తాత్కాలికంగా 'D54' అని వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని విఘ్నేష్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన గతంలో 'పోర్ తోళిల్‌' (Por Thozhil) వంటి విజయవంతమైన క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం క్రైమ్, థ్రిల్లర్, ఎమోషనల్ డ్రామా అంశాల కలయికతో ధనుష్‌కు కొత్త జానర్‌గా ఉంటుందని భావిస్తున్నారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మలయాళ నటులు జయరామ్, సూరజ్ వెంజరమూడ్ కూడా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story