Pooja Hegde : ఏడాదిన్నర తర్వాత .. బుట్టబొమ్మ మళ్లీ వచ్చేస్తోంది!

Pooja Hegde : ఏడాదిన్నర తర్వాత .. బుట్టబొమ్మ మళ్లీ వచ్చేస్తోంది!
X

'అల వైకుంఠపురములో' అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెబుతారు. 'గ్యాప్ తీసుకోలేదు, వచ్చింది' అని. తెలుగులో బుట్ట బొమ్మకు లాస్ట్ హిట్ అది. ఏడాదిన్నర తర్వాత మళ్లీ తెరపై మెరవబోతోంది బెంగళూరు భామ పూజాహెగ్దే. ఆమె నటిస్తున్న 'దేవా', 'రెట్రో','

తలపతి 69', 'హే జవానీతో ఇష్క్ హూనా హై' అన్ని చిత్రాలు అన్ సెట్స్ లో ఉన్నాయి. షాహిద్ కపూర్ హీరోగా రోషన్ అండ్రూ తెరకెక్కిస్తోన్న 'దేవా' ట్రైలర్ ఈనెల 21న రిలీజ్ చేస్తున్నారు. 31న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. పూజాకి ఇంతవరకూ హిందీలో సరైన సక్సెస్ ఒక్కటీ లేదు. దీంతో బాలీవుడ్ లో అవకాశాలు కూడా సన్నగిల్లాయి. దీంతో సౌత్ లో మళ్లీ కంబ్యాక్ అవ్వాలని ప్రయత్నాలు చేసి చాన్సులు అందుకుంది. దేవా సక్సెస్ అయితే హిందీలో కొత్త అవకాశాలకు చాన్స్ ఉంటుంది. ఐరెన్ లెగ్ అనే ముద్ర తొలగిపోతుంది.

తెలుగు సినిమాలతో స్టార్ హీరోయిన్ అయిన పూజా హెగ్డే... ఇక్కడ రెండున్నర కోట్లకు పైగా పారితోషికం అందుకున్న సందర్భాలు ఉన్నాయని ఫిలిం నగర్ వర్గాలు చెబుతాయి. అయితే రెండు వరుస డిజాస్టర్స్ తర్వాత ఆమెకు మరొక అవకాశం రాకపోవడం గమనార్హం. మార్చి 11, 2022లో 'రాధే‌ శ్యామ్' రిలీజ్ అయితే... అదే ఏడాది ఏప్రిల్ 29న ఆచార్య వచ్చింది.‌ ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'గుంటూరు కారం' సినిమా కోసం ఆవిడ కొన్ని రోజులు షూటింగ్ చేశారు. కానీ డేట్స్ ఇష్యూ వల్ల తప్పుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరో తెలుగు సినిమా ఆవిడ దగ్గరకు రాలేదు‌.

Tags

Next Story