Poonam Kaur : ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన పూనమ్ కౌర్!

Poonam Kaur : స్టార్ హీరోలందరిలో ప్రభాస్ రూటు వేరు అనే సంగతి తెలిసిందే. వివాదాలకు దూరంగా ఉండే హీరోగా ప్రభాస్ కు మంచి పేరుంది. తాజాగా రాధేశ్యామ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్ . పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి భారీగా కలెక్షన్లు వస్తున్నాయి.
ఇదిలావుండగా టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ ప్రభాస్ పై ప్రశంసలు కురిపించింది. ప్రభాస్ పక్కన నటించడం తనకు చాలా ఇష్టమని, తమ కాంబినేషన్‌లో ఓ సినిమా రావాలని కోరుకుంటున్నానని చెప్పింది. నిర్మాతల సంక్షేమం కోసం ప్రభాస్ ఊహించని స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నాడని పూనమ్ తెలిపింది. నిర్మాతల కోసం ప్రభాస్ మనస్పూర్తిగా ప్రమోషన్స్ చేస్తున్నాడని... మేకింగ్ కోసం చాలా ఖర్చు చేశామని నిర్మాతలు పడ్డ కష్టాన్ని చెబుతున్నాడని పూనమ్ కౌర్ తెలిపింది.
ఇక తనకి లవ్ స్టోరీలు ఇష్టమని, రాధేశ్యామ్ కూడా లవ్ స్టోరీ కాబట్టి ఈ సినిమా నచ్చిందని పూనమ్ కౌర్ చెప్పింది. ట్రైలర్‌లో కుర్చీలో కూర్చొని ప్రభాస్ చెప్పిన డైలాగ్ తనను ఆకట్టుకున్నట్లు పూనమ్ కౌర్ వెల్లడించింది. పూనమ్ కౌర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి భవిష్యత్తులోనైనా పూనమ్‌కి ప్రభాస్ సినిమాలో అవకాశం వస్తుందేమో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com