Actress Abhinaya : పెళ్లి పీటలు ఎక్కనున్న ప్రముఖ నటి అభినయ

Actress Abhinaya : పెళ్లి పీటలు ఎక్కనున్న ప్రముఖ నటి అభినయ
X

త్వరలోనే తాను వివాహం చేసుకోబోతున్నట్లు నటి అభినయ తెలిపారు. గత 15 ఏళ్లుగా తనతో కలిసి చదువుకున్న స్నేహితుడిని ప్రేమిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే అతడిని పెళ్లాడబోతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు. కాగా దివ్యాంగురాలైన(మూగ, చెవిటి) అభినయ హీరో విశాల్‌తో డేటింగ్ చేస్తున్నారని, పెళ్లి కూడా చేసుకుంటారని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. కాగా వీరిద్దరూ కలిసి ‘పూజ’, ‘మార్క్ ఆంటోనీ’ చిత్రాల్లో నటించారు.

తాజా మలయాళ చిత్రం 'పని' సోనీ లీవ్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. సినిమా చాలా బాగుంది అంటూ మంచి టాక్‌ ఉంది. నటుడు జోజూ జార్జ్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు . ఇందులో అభినయపై చిత్రీకరించిన అత్యాచార సన్నివేశం వివాదాస్పదమైంది. దీంతో జోజూ మేకింగ్‌ను అందరూ ట్రోల్‌ చేశారు. దీనిపై కూడా ఆమె రియాక్ట్‌ అయ్యారు. 'ఒక మూవీలో ఎలాంటి సీన్లు పెట్టాలి..? ఎలా తెరకెక్కించాలి..? వంటి అంశాలు పూర్తిగా దర్శకుడి నిర్ణయం. దానిని నటీనటులు తప్పకుండా గౌరవించాలి.

Tags

Next Story